ముందస్తు హెచ్చరిక… ఏపీలో శనివారం జోరు వర్షాలు..

Heavy rains in ap :అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి రెండు రోజుల్లో కొనసాగనుంది. అల్పపీడనం మరింతగా బలపడనుందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉరకలు పరుగులు పెడుతోంది. గడచిన మూడు రోజులుగా వరద నీరు క్రమేపీ […]

ముందస్తు హెచ్చరిక... ఏపీలో శనివారం జోరు వర్షాలు..

Updated on: Aug 14, 2020 | 10:49 PM

Heavy rains in ap :అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి రెండు రోజుల్లో కొనసాగనుంది. అల్పపీడనం మరింతగా బలపడనుందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.

భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉరకలు పరుగులు పెడుతోంది. గడచిన మూడు రోజులుగా వరద నీరు క్రమేపీ పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక వైపు మారిన వాతావరణం, వరుసగా అల్పపీడన ద్రోణులు, వాయుగుండం కూడా జతకలియడంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.