కరోనాతో బాధపడుతున్నాను వైద్యం అందించండి అని ప్రాధేయపడ్డాడు నెల్లూరు జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు. వైద్యం అందించడంలో వైద్యులు అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియో రికార్డు చేసి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌కు పంపించాడు. ఎమ్మెల్యే చొరవతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకున్న వైద్యులు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. అయినా అతని ప్రాణాలు నిలవలేదు. ఈ ఘటన జిల్లాలో అత్యంత విషాదాన్ని నింపింది.
మనుబోలు ఉన్నత పాఠశాల హెచ్ఎం కరోనాతో మృతి చెందాడు. అంత్యక్రియలకు హాజరైన జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి.. మెరుగైన వైద్యం అందించినా.. రమేశ్‌ను ప్రాణాలతో కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైన చనిపోతే.. డెడ్ బాడీలను హాస్పిటల్‌లోనే వదిలేసి మానవత్వాన్ని చావనివ్వద్దు అంటూ సూచించారు. కరోనా సోకుతుందన్న భయం వద్దన్న జేసీ.. ఇతరులకు సోకకుండా హాస్పిటల్‌లోనే డెడ్‌బాడీకి ప్యాక్ చేసి ఇస్తున్నట్లు తెలిపారు.