నాని ‘వి’ స్టోరీలైన్ ఇదేనా..!

|

Aug 21, 2020 | 12:56 PM

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన సినిమా ‘వి’. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

నాని వి స్టోరీలైన్ ఇదేనా..!
Follow us on

Nani V Movie: నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన సినిమా ‘వి’. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. నివేధా థామస్, అదితీ రావు హైదరీ హీరోయిన్‌లుగా నటించారు. నానికి ఇది 25వ సినిమా కాగా.. మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో ఇది మూడో సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్‌, రెండు పాటలు అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా కథాంశం ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని తన భార్య(అదితి రావు హైదరీ)ను చంపిన వాళ్లను ఒక్కొక్కరిగా మర్డర్ చేస్తూ ‘వి’ అనే అక్షరాన్ని క్రైమ్ స్పాట్‌లో వదిలి వెళ్తాడట. ఇక సుధీర్ బాబు ఈ హత్యల వెనుక మిస్టరీని చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని తెలుస్తోంది. ‌అసలు ఎవరు అదితిని చంపారు.? నాని ఎందుకు ‘వి’ అనే అక్షరం వదిలి వెళ్తున్నాడు.? చివరికి సుధీర్ బాబు, నానిని పట్టుకోగలిగాడా.? అనేది పూర్తి స్టోరీ అని సమాచారం. ఇది నిజమో కాదో పక్కన పెడితే.. కాన్సెప్ట్ మాత్రం అద్భుతంగా ఉందని.. బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు అంటున్నారు.  కాగా, ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో కనిపించనున్నాడు. వెన్నెల కిషోర్, జగపతి బాబు, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మించగా.. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

Also Read:

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..