వాళ్ళు మా రాష్ట్ర రైతులు కారు, ఈ ఆందోళనకు పంజాబ్ ముఖ్యమంత్రే కారణం, హర్యానా సీఎం ఖట్టర్

తమ పొరుగు రాష్ట్రమైన పంజాబ్ పై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ విరుచుకపడ్డారు. రైతులు ఆందోళన బాట పట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం  అమరేందర్ సింగే కారణమని..

వాళ్ళు మా రాష్ట్ర రైతులు కారు, ఈ ఆందోళనకు పంజాబ్ ముఖ్యమంత్రే కారణం, హర్యానా సీఎం ఖట్టర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 28, 2020 | 4:31 PM

తమ పొరుగు రాష్ట్రమైన పంజాబ్ పై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ విరుచుకపడ్డారు. రైతులు ఆందోళన బాట పట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం  అమరేందర్ సింగే కారణమని ఆయన ఆరోపించారు. అమరేందర్ కార్యాలయ ఆఫీసు బేరర్లే రైతుల నిరసనకు నేతృత్వం వహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఆందోళన చేస్తున్నవారు తమ రాష్ట్ర రైతులు కారని, వారంతా పొరుగు రాష్ట్రంవారని అన్నారు. ఈ ప్రొటెస్ట్ కి మా అన్నదాతలు దూరంగా ఉన్నారు. నన్నడిగితే పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే ఆఫీసు బేరర్లే ఇందుకు కారణం అని ఖట్టర్ పేర్కొన్నారు. రైతుల ఆందోళనపై తాను పంజాబ్ ముఖ్యమంత్రితో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆయన స్పందించలేదని ఖట్టర్ విమర్శించారు. ఇక తమ రాష్ట్ర పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారు ఎంతో నిగ్రహంతో వ్యవహరిస్తున్నారని, రైతులు రెచ్ఛగొట్టినా సంయమనంతో ఉన్నారని ఆయన అన్నారు.

ఢిల్లీ వెళ్తున్న అన్నదాతలను అడ్డుకోవద్దని, వారిని హర్యానా గుండా వెళ్లనివ్వాలని అమరేందర్ సింగ్ హర్యానా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇటీవల ట్వీట్ చేశారు. అయితే ఖట్టర్… మూడు రోజులుగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి యత్నిస్తున్నానని, కానీ మీ నుంచి రెస్పాన్స్ లేదని. మీరు కేవలం ట్వీట్లు చేస్తూ చర్చల నుంచి దూరంగా పారిపోతున్నారని ఎదురు దాడికి దిగారు. ఇలా ఉండగా రైతు లోకం ఢిల్లీలో ఇంత పెద్దఎత్తున ప్రదర్శనలకు దిగుతున్నా, వారిపై పోలీసులు లాఠీ ఛార్జి చేస్తూ, బాష్పవాయువు ప్రయోగిస్తున్నా ఒక్క రాజకీయ పార్టీకూడా స్పందించని విషయం గమనార్హం.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..