హరీశ్ రావు ఆగ్రహం

|

Aug 31, 2020 | 7:30 PM

జీఎస్టీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తోన్న తీరుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీకి సంబంధించి రాష్ట్రానికి పూర్తి స్థాయి బకాయిలు చెల్లించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం కరోనా సాకుతో..

హరీశ్ రావు ఆగ్రహం
Follow us on

జీఎస్టీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తోన్న తీరుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీకి సంబంధించి రాష్ట్రానికి పూర్తి స్థాయి బకాయిలు చెల్లించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం కరోనా సాకుతో రూ.లక్షా 35 కోట్లు ఎగ్గొట్టాలని చూస్తోందన్నారు. రూ.3 లక్షల కోట్ల జీఎస్టీ బకాయిల్ని లక్షా 65 వేల కోట్లకు తగ్గించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే కరోనా వల్ల 4 నెలల్లో తెలంగాణ రూ.8 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన సెస్సును ఎగ్గొట్టాలని కేంద్రం చూస్తోందని హరీశ్‌రావు చెప్పారు. జీఎస్టీలో చేరకపోతే తెలంగాణకు రూ.25 వేల కోట్లు అదనంగా వచ్చేవని, అయినా దేశ ప్రయోజనాల కోసం జీఎస్టీలో చేరామని తెలిపారు. ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాలు రాష్ట్రాల హక్కులను కాలరాశాయని మండిపడ్డారు. ఆదాయం మిగిలితే తీసుకుంటాం… తగ్గితే అప్పు తెచ్చుకోండి అన్న తీరుగా కేంద్రం వ్యవహరిస్తోందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు .