Group Clashes: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఉదయాన్నే రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణ నెలకొంది. ఒక వర్గం యువకుడిపై మరొక వర్గం యువకులు దాడికి పాల్పడ్డారు. నడిరోడ్డుపై కారు ఆపి సదరు యువకుడిపై దాడి చేశారు. దీంతో ప్రత్యర్థి వర్గం ప్రతిదాడికి దిగింది. ఘటనపై ఫిర్యాదు అందటంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇలాఉండగా, బాధిత యువకుడి తండ్రిపై రెండు నెలల క్రితం కత్తితో దాడి జరిగిన సంగతి గమనార్హం. కొంతకాలంగా నర్సరావుపేటలో వరుస దాడులు జరుగుతోన్న నేపథ్యంలో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.