కరోనా వ్యాక్సిన్ సంస్థలతో.. జాతీయ నిపుణుల బృందం భేటీ!

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా డ్రగ్ తయారీ, సేకరణపై భారత సర్కారు దృష్టిసారించింది. ఇందులో భాగంగానే

కరోనా వ్యాక్సిన్ సంస్థలతో.. జాతీయ నిపుణుల బృందం భేటీ!

Edited By:

Updated on: Aug 18, 2020 | 7:42 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా డ్రగ్ తయారీ, సేకరణపై భారత సర్కారు దృష్టిసారించింది. ఇందులో భాగంగానే జాతీయ నిపుణుల బృందం ప్రముఖ దేశీయ తయారీ సంస్థలైన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌, జైడస్‌ కేడిలా, తదితర ప్రతినిధులతో భేటీ అయ్యింది. ఈ సమావేశం పరస్పరం ప్రయోజనకరంగా, ఉత్పాదకంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కరోనా కట్టడి కోసం.. స్వదేశీ టీకాగురించి నిపుణుల బృందం తెలుసుకున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వారు ఏమి ఆశిస్తున్నారో అడిగి తెలుసుకున్న దన్నారు. ఈ సమావేశానికి నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ అధ్యక్షత వహించారు. అలాగే, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషన్‌ ఉపాధ్యకుడిగా వ్యవహరించారు. ఈ ప్యానెల్‌ ఐదు దేశీయ సంస్థలైన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (పుణె), భారత్‌ బయోటెక్‌(హైదరాబాద్‌), జైడస్‌ కేడిలా (అహ్మదాబాద్‌), జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్‌ (పుణె), బయోలాజికల్‌ ఈ (హైదరాబాద్‌) ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమైంది.

Read More:

గోదావరి కి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!

సీపీఎల్‌ టి20: నేటి నుంచి కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌!