హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి నల్లగొండకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఆయన కారు రోడ్డు పక్కకు దూసుకు వెళ్లింది. కారు స్టీరింగ్ బిగుసుకుపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నల్లగొండలో జరగనున్న పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు దత్తాత్రేయ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదం అనంతరం దత్తాత్రేయ మరో వాహనంలో నల్లగొండకు బయలుదేరారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: