ప్ర‌పంచంలో అత్య‌ధికంగా ఏనుగులు మ‌ర‌ణిస్తున్న‌ దేశాల జాబితాలో శ్రీ‌లంక ముందంజ‌.. తాజా నివేదిక‌లు వెల్ల‌డి

ప్రపంచంలోనే అత్యధికంగా ఏనుగులు మరణిస్తోన్న దేశాల జాబితాలో శ్రీలంక ముందుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏనుగులు-మానవుల మధ్య జరుగుతున్న సంఘర్షణ వల్ల ఏనుగుల మరణాలతో

ప్ర‌పంచంలో అత్య‌ధికంగా ఏనుగులు మ‌ర‌ణిస్తున్న‌ దేశాల జాబితాలో శ్రీ‌లంక ముందంజ‌.. తాజా నివేదిక‌లు వెల్ల‌డి
Follow us

|

Updated on: Dec 14, 2020 | 10:39 AM

ప్రపంచంలోనే అత్యధికంగా ఏనుగులు మరణిస్తోన్న దేశాల జాబితాలో శ్రీలంక ముందుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏనుగులు-మానవుల మధ్య జరుగుతున్న సంఘర్షణ వల్ల ఏనుగుల మరణాలతో పాటు ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజాగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్ తర్వాత శ్రీలంకలోనే ఎక్కువగా ఏనుగుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో అప్రమత్తమైన శ్రీలంక ప్రభుత్వం, ఏనుగుల నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది.

అయితే ఏనుగులు- ప్రజల మధ్య చోటు చేసుకుంటున్న సంఘర్షణ వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండ‌గా, త‌ర్వాత స్థానంలో శ్రీలంక ఉన్నట్లు అక్కడి జాతీయ దర్యాప్తు బృందం పేర్కొంది. గత ఏడాది వివిధ కారణాల వల్ల శ్రీలంకలో 272 ఏనుగులు మరణించగా, ఈ ఏడాదిలో 407 ఏనుగులు మరణించినట్లు దర్యాప్తు కమిటీ తెలిపింది. అయితే ప్రతి సంవత్సరం సరాసరి 85 మంది మరణిస్తుండగా, ప్రస్తుతం అది 112కి పెరిగింది. గడిచిన 60 ఏళ్లుగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ వీటిని తగ్గించడంలో ఇప్పటి వరకు ఆశించిన పురోగతి సాధించలేదని దర్యాప్తు కమిటీ ఛైర్మన్ టిస్సా విటరనా పేర్కొన్నారు.

ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణంతో ఇరువైపులా భారీ న‌ష్టం

కాగా, భారత్ లోనూ ఏనుగులు-మానవుల మధ్య ఏర్పడుతున్న ఘర్షణ వాతావరణంతో ఇరువైపులా భారీ స్థాయిలోనూ ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఇలాంటి ఘటనల వల్ల గడిచిన ఐదేళ్ల కాలంలో 2300 మంది ప్రాణాలు కోల్పోగా, 500లకు పైగా ఏనుగులు మరణించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యుదాఘాతంతోనే అధిక సంఖ్యలో ఏనుగులు మరణిస్తుండగా, రైతు ప్రమాదాలు, వేటగాళ్ల కారణంగా ఏనుగులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇక ఏనుగులు, పులుల దాడులలో ఎక్కువగా మరణిస్తున్న వారి సంఖ్య పశ్చిమబెంగాల్లో అధికంగా ఉండగా, ఒడిశా, మహారాష్ట్రలలో ఎక్కువ‌ మంది ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు చెబుతున్నాయి.

Latest Articles
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి