Google New Year Wishes: నెటిజెన్లకు వెరైటీగా శుభాకాంక్షలు తెలిపిన గూగుల్.. కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి..

|

Jan 01, 2021 | 1:57 PM

Google New Year Wishes: మరికొన్ని గంటల్లో కొత్తేడాదిలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడం ప్రారంభమైంది. సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా...

Google New Year Wishes: నెటిజెన్లకు వెరైటీగా శుభాకాంక్షలు తెలిపిన గూగుల్.. కావాలంటే మీరూ ట్రై  చేసి చూడండి..
Follow us on

Google New Year Wishes: మరికొన్ని గంటల్లో కొత్తేడాదిలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడం ప్రారంభమైంది. సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కొత్తేడాది శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కూడా నెటిజెన్లకు న్యూ ఇయర్ విషెస్ చెప్పింది.
అయితే అందరిలా శుభాకాంక్షలు చెబితే గూగుల్ ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి.. అందుకే కాస్త వెరైటీగా ప్లాన్ చేసింది. గూగుల్ డూడుల్ రూపొందించి మరీ విషెస్ తెలిపింది. ఇందులో భాగంగానే గూగుల్ డూడుల్‌ని ప్రత్యేకంగా రూపొందించింది. ‘న్యూ ఇయర్ ఈవ్’ పేరుతో రూపొందించిన డూడుల్‌ని క్లిక్ చేయగానే.. కొత్తేడాదికి సంబంధించిన ప్రత్యేక కథనాలతో పాటు వార్తలను కూడా అందించింది. ఇక ఇదే సమయంలో డూడుల్‌పై క్లిక్ చేయగానే వెబ్ పేజీ ఓపెన్ కావడంతో పాటు.. రకరకాల రంగుల్లో ఉన్న కాగితాలు స్క్రీన్‌పై పడుతున్నట్లు రూపొందించడం విశేషం. ఏంటి నమ్మలేక పోతున్నారా.? అయితే వెంటనే ఈ లింక్‌ని క్లిక్ చేసి.. https://www.google.com/.. డూడుల్‌పై నొక్కండి.

Also Read: New Year Celebrations: ఏ దేశం ఎప్పుడు కొత్తేడాదిలోకి అడుగుపెడుతోందో తెలుసా.? మొత్తం 26 గంటలు..