Punjab National Bank: పంజాబ్ నేషన్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. ఆఫర్లే ఆఫర్లు.. పూర్తి వివరాలు మీకోసం..

|

Sep 02, 2021 | 8:23 AM

Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా ఉన్నవారికి శుభవార్త. తమ కస్టమర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు సర్వీస్ చార్జీలను భారీగా తగ్గింది.

Punjab National Bank: పంజాబ్ నేషన్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. ఆఫర్లే ఆఫర్లు.. పూర్తి వివరాలు మీకోసం..
Pnb
Follow us on

Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా ఉన్నవారికి శుభవార్త. తమ కస్టమర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు సర్వీస్ చార్జీలను భారీగా తగ్గింది. ఇది మాత్రమే కాదు.. రుణాలపై వడ్డీ రేటును కూడా తగ్గింది. ఈ నిర్ణయం ద్వారా కస్టమర్లు తక్కువ వడ్డీ రేటుతోనే రుణం తీసుకోవచ్చు. ఒకవేళ మీకు పీఎన్‌బీలో ఖాతా ఉన్నట్లయితే.. ఆ సంస్థ తీసుకున్న తాజాగా నిర్ణయాలతో మీరు కూడా ప్రయోజనం పొందుతారు.

ఫెస్టివల్ ఆఫర్..
పండుగ సీజన్ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిటైల్ ఉత్పత్తులపై అన్ని సర్వీస్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రిటైల్‌కు సంబంధించిన సేవను ఎలాంటి సర్వీస్ ఛార్జ్, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా పొందవచ్చు.

తక్కువ వడ్డీ రేటు..
పీఎన్‌బీ ప్రకటించిన సమాచారం ప్రకారం.. తమ కస్టమర్లకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తోంది. కొత్త అప్‌డేట్ ప్రకారం.. 6.80 వడ్డీ రేటుతో గృహ రుణాలపై, 7.15 వడ్డీ రేటుతో వాహన రుణాలుు మంజూరు చేస్తోంది. ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా బ్యాంక్ సర్వీస్ చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, హౌస్ లోన్స్, వెహికిల్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, పర్సనల్ లోన్స్, పెన్షన్ లోన్స్, గోల్డ్ లోన్స్ పై డాక్యుమెంటేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

పర్సనల్ లోన్స్‌పై స్పెషల్ లోన్స్..
ఇదిలాఉంటే.. పీఎన్‌బీ తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 8.95 వడ్డీ రేటుతో పర్సనల్ లోన్స్ ఇస్తోంది. బ్యాంకింగ్ రంగంలోనే అతి తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇస్తోంది పీఎన్‌బీ. డిసెంబర్ 31, 2021 వరకు కస్టమర్లు ఈ ఆఫర్‌ను సద్వినియోగపరుచుకోవచ్చు అని, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా రుణాలు పొందవచ్చునని పీఎన్‌బీ ప్రకటించింది. ఈ ఆఫర్.. ఖాతాదారుల క్రెడిట్ పోర్ట్‌పోలియోకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని, కస్టమర్ వ్యయాన్ని పెంచడంలో ఈ ఆఫర్లు ఉపయోగపడుతాయని బ్యాంక్ అభిప్రాయపడింది.

Also read:

Pawan Kalyan Birthday: అలుపెరగని సేనాని బర్త్‌డే స్పెషల్ లైవ్ వీడియో

SBI Customers: ఎస్‌బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక.. మీరు ఎంత రుణం పొందవచ్చో ఇలా తెలుసుకోండి..

Pawan Kalyan: పవన్‌ పుట్టిన రోజున సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దేవీశ్రీ.. అప్పట్లో కుదరని ఓ వీడియో విడుదల.