Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..

గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు సోమవారం మాత్రం(నవంబర్‌ 29) కొంచెం ఊరటనిచ్చాయి. చాలా నగరాల్లో స్వల్పంగా మాత్రమే పెరిగాయి. కొన్ని నగరాల్లో స్వల్పంగా తగ్గాయి కూడా.

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..

Updated on: Nov 29, 2021 | 7:43 AM

గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు సోమవారం మాత్రం(నవంబర్‌ 29) కొంచెం ఊరటనిచ్చాయి. చాలా నగరాల్లో స్వల్పంగా మాత్రమే పెరిగాయి. కొన్ని నగరాల్లో స్వల్పంగా తగ్గాయి కూడా. మున్ముందు పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,210ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,320 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,320గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,340 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140 వద్ద కొనసాగుతోంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,1540గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,140వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం ధరలు పెరుగుదలకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటలకు నమోదైనవి. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే మళ్లీ ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

Stock Market: కొత్త వేరియంట్ భయాలతో స్టాక్ మార్కెట్.. ఈ రోజు ఎలా ఉండబోతుందంటే..

Reliance Jio రీఛార్జ్ ప్లాన్‌లు డిసెంబర్ 1 నుంచి ఖరీదైనవి.. కొత్త రేట్లు తెలుసుకోండి..

Smart Phones: ఈ వారం ఇండియాలో విడుదలయ్యే ఫోన్‌లు, వాటి ధర.. ఫీచర్స్‌ తెలుసుకోండి..

Loading...
Unable to load recommendations.
Follow Us