కాస్త దిగివచ్చిన పసిడి ధర..!

|

May 25, 2020 | 9:42 PM

సామాన్యులకి అందనంత దూరంలో పరిగెడుతున్న బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చాయి. ఇవాళ బులియన్ మార్కెట్ భిన్న ధరలు పలికాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా దేశీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గింది. గత మూడు రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1050 క్షీణించింది. దీంతో ధర రూ.44,870 పలికింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా క్షీణించింది. 10 గ్రాముల బంగారం ధర రూ.960 తగ్గుదలతో రూ.48,680కు దిగివచ్చింది.పసిడి ధర […]

కాస్త దిగివచ్చిన పసిడి ధర..!
Follow us on

సామాన్యులకి అందనంత దూరంలో పరిగెడుతున్న బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చాయి. ఇవాళ బులియన్ మార్కెట్ భిన్న ధరలు పలికాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా దేశీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గింది. గత మూడు రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1050 క్షీణించింది. దీంతో ధర రూ.44,870 పలికింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా క్షీణించింది. 10 గ్రాముల బంగారం ధర రూ.960 తగ్గుదలతో రూ.48,680కు దిగివచ్చింది.పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం రూ.590 పై గా పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,250కు ఎగసింది. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.74 శాతం పైకి కదిలింది. దీంతో ధర ఔన్స్‌కు 1734.70 డాలర్లకు చేరింది. బంగారం ధర తో పోటీగా వెండి ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 1.88 శాతం పెరుగుదలతో 17.69 డాలర్లకు ఎగసింది.