Gold Cost Today(04-02-2021): మహిళలకు గుడ్ న్యూస్ .. పరుగులు ఆపిన పసిడి.. ఈరోజు బంగారం ధర ఎంతో తెలుసా..!

|

Feb 04, 2021 | 7:38 AM

పసిడి ప్రియులకు శుభవార్త.. బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో పసిడి ధర పరుగులు ఆపింది. రోజు రోజుకీ బంగారం ధర దిగివస్తుంది. వరసగా నాలుగో రోజు కూడా..

Gold Cost Today(04-02-2021): మహిళలకు గుడ్ న్యూస్ .. పరుగులు ఆపిన పసిడి.. ఈరోజు బంగారం ధర ఎంతో తెలుసా..!
Follow us on

Gold Cost Today(04-02-2021): పసిడి ప్రియులకు శుభవార్త.. బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో పసిడి ధర పరుగులు ఆపింది. రోజు రోజుకీ బంగారం ధర దిగివస్తుంది. వరసగా నాలుగో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో గురువారం గోల్డ్ కాస్ట్ భారీగా తగ్గింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,820గా ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,750గా ఉంది. నిన్నటితో పోలిస్తే..ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 మేర తగ్గి.. తాజాగా రూ. 44,750లకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.440 క్షీణించిం ఈరోజు రూ. 48,820గా ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది. ఇక చెన్నై లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,290 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,400గా ఉంది.

బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో బంగారం ధరలు దిగివస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా తగ్గేసూచనలున్నాయని.. సో బంగారం కొనులుగోలు చేసే వినియోగదారులు స్థానిక మార్కెట్ పై ఓ లుక్ వేసి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

20 ఏళ్ల క్రితం భర్త కలను నమ్మింది.. రాత్రికి రాత్రే రూ. 340 కోట్లకు అధిపతి అయ్యింది ఓ భార్య .. ఎలా అంటే..!

  కీలక నిర్ణయం తీసుకున్న అమేజాన్‌ సీఈఓ… ఈ ఏడాది పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటన..