Godavari Boat Accident: గోదావరిలో పడవ మునక.. 40 మంది గల్లంతు..?

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో విషాదం నెలకొంది. కచ్చులూరు సమీపంలో పర్యటక బోటు మునిగిపోయింది. కాగా, ప్రమాద సమయంలో బోటులో 61 మంది పర్యటకులు ఉన్నట్లు సమాచారం. పాపికొండలు టూర్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్నటి వరకు గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండేది. తాజాగా వరద ఉధృతి తగ్గడంతో పర్యాటకానికి అధికారులు అనుమతి ఇచ్చారు. సమచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 21 […]

Godavari Boat Accident: గోదావరిలో పడవ మునక.. 40 మంది గల్లంతు..?

Edited By:

Updated on: Sep 16, 2019 | 10:20 AM

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో విషాదం నెలకొంది. కచ్చులూరు సమీపంలో పర్యటక బోటు మునిగిపోయింది. కాగా, ప్రమాద సమయంలో బోటులో 61 మంది పర్యటకులు ఉన్నట్లు సమాచారం. పాపికొండలు టూర్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్నటి వరకు గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండేది. తాజాగా వరద ఉధృతి తగ్గడంతో పర్యాటకానికి అధికారులు అనుమతి ఇచ్చారు. సమచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 21 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. లైఫ్ జాకెట్లతో 14 మంది ప్రయాణికులు క్షేమంగా వచ్చినట్లు తెలుస్తోంది.