Goa To Impose Fine : గోవా సర్కార్ కీలక నిర్ణయం.. బీచ్‌లో మద్యం తాగితే రూ. 10వేలు జరిమానా..

|

Jan 08, 2021 | 10:34 PM

గోవా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీచ్‌ల్లో మద్యం తాగితే రూ.10వేలు చొప్పున జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గోవాలోని పలు తీర ప్రాంతాలు మద్యం సీసాలతో నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Goa To Impose Fine : గోవా సర్కార్ కీలక నిర్ణయం.. బీచ్‌లో మద్యం తాగితే రూ. 10వేలు జరిమానా..
Follow us on

Goa To Impose Fine : గోవా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీచ్‌ల్లో మద్యం తాగితే రూ.10వేలు చొప్పున జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గోవాలోని పలు తీర ప్రాంతాలు మద్యం సీసాలతో నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బీచ్‌ల్లో మద్యం తాగొద్దని సూచిస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. వీటితోపాటు మరికొన్ని నిర్ణయాలను తెలియజేస్తు బోర్డులను సైతం ఏర్పాటు చేసినట్టు పర్యాటక శాఖ డైరెక్టర్‌ మెనినో డిసౌజా తెలిపారు.

బీచ్‌లలో మద్యం తాగితే వ్యక్తులపై రూ.2వేలు, సమూహాలపై రూ.10వేలు చొప్పున జరిమానా విధించేలా పర్యాటక వాణిజ్య చట్టానికి 2019 జనవరిలోనే సవరణలు చేసినట్టు ఆయన ప్రకటించారు. ఈ సవరించిన చట్టాన్ని పోలీసుల ద్వారా పర్యాటక శాఖ అమలు చేస్తోందని అన్నారు. తమ శాఖకు సిబ్బంది తగినంతగా ఉంటే వారితోనే సొంతంగా దీన్ని అమలు చేయగలుగుతామని మెనినో డిసౌజా తెలిపారు.