రాత్రంతా చితకబాదారు, ఉదయం అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు

ఉత్తరప్రదేశ్‌ రామ్‌పూర్‌లోని సుమలి నగర్‌లో చిత్రమైన పెళ్లి జరిగింది.. పెళ్లంటే మామూలు పెళ్లి కాదది... వధువు తరఫు వాళ్లు జీవితాంతం గుర్తు పెట్టుకునేట్టుగా జరిపించారు..

రాత్రంతా చితకబాదారు, ఉదయం అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు
Follow us

|

Updated on: Nov 23, 2020 | 3:31 PM

ఉత్తరప్రదేశ్‌ రామ్‌పూర్‌లోని సుమలి నగర్‌లో చిత్రమైన పెళ్లి జరిగింది.. పెళ్లంటే మామూలు పెళ్లి కాదది… వధువు తరఫు వాళ్లు జీవితాంతం గుర్తు పెట్టుకునేట్టుగా జరిపించారు.. ఆ పెళ్లి ముచ్చటమేమిటంటే.. ప్రేమించిన అమ్మాయిని కలుసుకోడానికి అర్థరాత్రిపూట తోటరాముడిలా ఆమె ఇంటికే వెళ్లాడో సాహస ప్రేమికుడు.. ఎంత చాటుమాటుగా కలుసుకుందామనుకున్నా పాపం అమ్మాయి ఇంటివాళ్లకు దొరికిపోయాడా ప్రేమికుడు.. అంత రాత్రిపూట అమ్మాయి కోసం వచ్చిన వ్యక్తి దొరికితే ఎందుకు ఊరుకుంటారు? పాపం రాత్రంతా గదిలో బంధించి చితక్కొట్టారు. ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు.. తెల్లారిన తర్వాత అతడిని సమీపంలోని అజిమ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. విషయమంతా కనుక్కున్న పోలీసులు అమ్మాయి, అబ్బాయి తరపు పెద్దలను స్టేషన్‌కు పిలిపించారు.. అక్కడే ఇద్దరు మధ్య రాజీ కుదిర్చారు.. మొత్తానికి పెళ్లికి ఇరుపక్షాలను ఒప్పించారు.. అంతే .. ఆ ఉదయమే ప్రేమికులకు పెళ్లి చేశారు.. పాపం రాత్రంతా ఓ రకమైన సన్మానం.. ఉదయం మరో రకమైన సత్కారం.. ఇంత జరిగిన తర్వాత ఈ పెళ్లిని ఆ అబ్బాయి ఎలా మర్చిపోగలడు చెప్పండి..?

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్