నగరవాసులకు కేటీఆర్ విజ్ఞప్తి.. ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్

|

Oct 18, 2020 | 11:38 AM

నగర పౌరులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు విజ్ఞప్తులు చేశారు. జంటనగరాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నందున నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టుటకు కాచి చల్లార్చి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించుటకు జిహెచ్ఎంసి కి సహకరించండి అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు, కేటీఆర్ ఆదేశాలమేరకు వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చేందుకు జిహెచ్ఎంసి యంత్రాంగం మమ్మర చర్యలు చేపట్టింది. సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో […]

నగరవాసులకు కేటీఆర్ విజ్ఞప్తి.. ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్
Follow us on

నగర పౌరులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు విజ్ఞప్తులు చేశారు. జంటనగరాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నందున నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టుటకు కాచి చల్లార్చి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించుటకు జిహెచ్ఎంసి కి సహకరించండి అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు, కేటీఆర్ ఆదేశాలమేరకు వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చేందుకు జిహెచ్ఎంసి యంత్రాంగం మమ్మర చర్యలు చేపట్టింది. సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో కమిషనర్, జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు తిరిగి మానిటరింగ్ చేస్తున్నారు. పంపులు ఏర్పాటు చేసి ఇంజనీరింగ్, డిఆర్ఎఫ్ సిబ్బంది.. కాలనీలు, సెల్లార్లు, రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపింగ్ చేస్తున్నారు. వరదతో రోడ్లు, నాలాల్లోకి కొట్టుకువచ్చిన చెత్త, చెదారం, భవన నిర్మాణ, శిధిల వ్యర్ధాల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. మరోవైపు, ఎంటమాలజి, డిఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది రంగంలోకి దిగి అంటువ్యాధుల నివారణకై వరద ప్రభావిత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి, యాంటీ లార్వా, సోడియం హైపో క్లోరైట్ క్రిమిసంహారకాలను స్ప్రే చేస్తున్నారు.