ఆ షాపులను వెంటనే మూసివేయండి-జీహెచ్ఎంసీ

బక్రీదు సందర్భంగా జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో గోవధ శాలలు, బీఫ్ షాపులు మూసివేయాలని ఆదేశించారు. ఆగస్టు 1, 2 తేదీల్లో మూసివేయాలని..

ఆ షాపులను వెంటనే మూసివేయండి-జీహెచ్ఎంసీ

Updated on: Jul 29, 2020 | 1:16 AM

బక్రీదు సందర్భంగా జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో గోవధ శాలలు, బీఫ్ షాపులు మూసివేయాలని ఆదేశించారు. ఆగస్టు 1, 2 తేదీల్లో మూసివేయాలని జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల అమలులో మున్సిపల్ సిబ్బందికి సంబంధిత అధికారులు సహకరించాలని తెలిపింది.

ఇక ఆగస్టు 1 నుంచి మూడు రోజులపాటు జరగనున్న బక్రీద్ పండగను పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మంగళవారం జిహెచ్ఎంసి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. రానున్న బక్రీదు పండుగ ప్రత్యేక పరిస్థితుల మధ్య జరగనుందనన్నారు. కరోనా వైరస్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ముస్లింలు ప్రత్యేక శ్రద్ధ వహించి పండగ జరుపుకోవాలని… ప్రార్థనలు ఇంటిలోనే చేయాలన్నారు. అక్కడ కూడా భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్క్ లను ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us