జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కరోనా కలకలం..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. 4వ ఫ్లోర్ లోని ఒక సెక్షన్ లో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కరోనా కలకలం..

Edited By:

Updated on: Jun 08, 2020 | 1:13 PM

తెలంగాణాలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. 4వ ఫ్లోర్ లోని ఒక సెక్షన్ లో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. ఫోర్త్ ఫ్లోర్ లో శానిటైజేషన్ చర్యలు ప్రారంభించారు. దాదాపు 1500 వందల మంది ఉద్యోగులు బల్దియా లో పనిచేస్తున్నారు. ఈ సంఘటనతో 4వ ఫ్లోర్ లో పనిచేసే ఉద్యోగులందరిని అధికారులు ఇళ్ళకు పంపించారు.

ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు టీవీ9 తో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలో కరోనా పాజిటివ్ కేసు గుర్తింపుతో అధికారులు అప్రమత్తమైయ్యారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం అంతా సానిటైజ్ చేస్తున్నామని చెప్పారు. కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లని సిబ్బంది శుద్ధి చేస్తున్నారని, ఉద్యోగులందరినీ ఒక హెల్త్ ఆఫీసర్ అబ్జర్వేషన్ లో ఉంచామని వివరించారు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు మాస్కులు, సానిటీజర్లు, థర్మల్ స్క్రీనింగ్ సైతం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

Also Read: కరోనాపై విజయం.. యాక్టివ్ కేసులు లేని దేశంగా..