GHMC Election Results 2020 : గ్రేటర్‌ ఎన్నికల బరిలో నిలిచిన కీలక నేతల కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరుల భవితవ్యం ఏమిటో..!

| Edited By: Ram Naramaneni

Dec 04, 2020 | 6:30 AM

గ్రేటర్‌ ఎన్నికల్లో పలువురు కీలక నేతల కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు బరిలోకి దిగారు. వారిని గెలిపించుకోవడానికి ఆ నాయకులు...

GHMC Election Results 2020 : గ్రేటర్‌ ఎన్నికల బరిలో నిలిచిన కీలక నేతల కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరుల భవితవ్యం ఏమిటో..!
Follow us on

గ్రేటర్‌ ఎన్నికల్లో పలువురు కీలక నేతల కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు బరిలోకి దిగారు. వారిని గెలిపించుకోవడానికి ఆ నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఈ ట్రెండ్‌ కనిపించింది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారటమేకాకుండా, ఫలితాలపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ప్రధానపార్టీల నాయకుల కుటుంబ సభ్యులు, బంధువులు పోటీలో నిలవడంతో బల్దియా దంగల్‌ మరికాస్త ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ తరఫున ఎక్కువమంది నాయకుల కుటుంబ సభ్యులు, అనుచరులు పోటీ చేశారు. వీరిలో చాలామంది మేయర్‌ పదవి ఆశిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోడలు, హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూతురు, రాజ్యసభ సభ్యుడు కేశవరావు కూతురు, మంత్రి మల్లారెడ్డి కూతురు, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు కోడలు, మాజీ మంత్రి పి.జనార్దన్‌రెడ్డి కూతురు విజయారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భార్య శ్రీదేవి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోడలు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరంతా మేయర్‌ రేసులో ఉన్నారు. ఎందుకంటే ఈసారి మహిళా రిజర్వేషన్‌ జనరల్‌ కోటాలో ఉంది మేయర్‌ పీఠం. అందుకే ఎలాగైనా ఈసారి దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. మరి అధిష్టానం మదిలో ఏముందో తెలియాలంటే మరికాసేపు వెయిట్‌ చేయాల్సిందే.