కరోనా ఒత్తిడి నేప‌థ్యంలో జర్మనీ మంత్రి ఆత్మహత్య…

|

Mar 29, 2020 | 8:48 PM

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలో అల్ల‌క‌ల్లోలం క్రియేట్ చేస్తోంది. ప్ర‌పంచంలోని 200 పైగా దేశాలు ఈ వైర‌స్ తో జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌ను ఎదుర్కుంటున్నాయి. తాజాగా జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కోవిడ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఆయన సూసైడ్ చేసుకున్నారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. హొచీమ్ సిటీలో ఆయన డెడ్ బాడీని హై స్పీడ్ రైల్వే లైన్‌పై గుర్తించారు. కాక‌పోతే ఈ […]

కరోనా ఒత్తిడి నేప‌థ్యంలో జర్మనీ మంత్రి ఆత్మహత్య...
Follow us on

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలో అల్ల‌క‌ల్లోలం క్రియేట్ చేస్తోంది. ప్ర‌పంచంలోని 200 పైగా దేశాలు ఈ వైర‌స్ తో జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌ను ఎదుర్కుంటున్నాయి. తాజాగా జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కోవిడ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఆయన సూసైడ్ చేసుకున్నారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. హొచీమ్ సిటీలో ఆయన డెడ్ బాడీని హై స్పీడ్ రైల్వే లైన్‌పై గుర్తించారు. కాక‌పోతే ఈ కేసుకు సంబంధించిన వివరాలను బ‌య‌ట‌కు చెప్ప‌కుండా పోలీసులు చాలాసేపు గోప్య‌త పాటించారు.

అయితే సూసైడ్ కు ముందు థామ‌స్ సూసైడ్ లెట‌ర్ రాసినట్టు స‌మాచారం. క‌రోనా నేప‌థ్యంలో మంత్రి ఇటీవ‌ల ప్ర‌జ‌ల్లో క‌లియ‌తిరిగారు. కోవిడ్ వ‌ల్ల ఆర్థిక సంక్షోభం రావొచ్చ‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు స‌మాచారం అందించారు. థామ‌స్ జ‌ర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమొక్రాట్స్ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. గ‌త రెండు ద‌శాబ్దాలు నుంచి పాలిటిక్స్ లో రాణిస్తున్న ఆయ‌న..దాదాపు 10 సంవ‌త్స‌రాలుగా ఆర్థిక మంత్రిగా సేవ‌లు అందిస్తున్నారు.