MS Dhoni: ధోని విజయానికి అసలు కారణం ఆ ఇద్దరే..!

 MS Dhoni Captaincy: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్స్ ఉన్న జట్టుకు ధోని కెప్టెన్ కావడం అదృష్టమని గంభీర్ అన్నాడు. గంగూలీ తర్వాత సారధ్య బాధ్యతలు తీసుకున్న ధోనికి.. గొప్ప ఆటగాళ్లు ఉన్న జట్టు లభించడం వల్లే అతడు లక్కీ కెప్టెన్ అయ్యాడని గంభీర్ అన్నాడు. 2011 ప్రపంచకప్ సమయంలో సెహ్వాగ్, సచిన్, యువరాజ్‌తో పాటు తాను కూడా జట్టులో […]

MS Dhoni: ధోని విజయానికి అసలు కారణం ఆ ఇద్దరే..!
Follow us

|

Updated on: Jul 12, 2020 | 6:50 PM

 MS Dhoni Captaincy: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్స్ ఉన్న జట్టుకు ధోని కెప్టెన్ కావడం అదృష్టమని గంభీర్ అన్నాడు. గంగూలీ తర్వాత సారధ్య బాధ్యతలు తీసుకున్న ధోనికి.. గొప్ప ఆటగాళ్లు ఉన్న జట్టు లభించడం వల్లే అతడు లక్కీ కెప్టెన్ అయ్యాడని గంభీర్ అన్నాడు.

2011 ప్రపంచకప్ సమయంలో సెహ్వాగ్, సచిన్, యువరాజ్‌తో పాటు తాను కూడా జట్టులో ఉండటం వల్ల ధోని కెప్టెన్సీ చాలా సులువైందని.. ఇలాంటి మేటి ఆటగాళ్లను సిద్దం చేయడంలో గంగూలీ చాలా కష్టపడ్డాడని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంగూలీ వల్లే ధోని ఎన్నో ట్రోఫీలు సాధించాడన్న గంభీర్.. టెస్టుల్లో ధోని విజయవంతమైన కెప్టెన్ అనిపించుకోవడానికి గల కారణం జహీర్ ఖాన్ అని అన్నాడు. దాదా వల్లే ధోనికి ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ లభించాడని జహీర్ ఖాన్‌పై గంభీర్ ప్రశంసలు కురిపించాడు.

Latest Articles