టీమ్‌ కూర్పుపై కోహ్లీకి అవగాహన లేదన్న గంభీర్‌

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ సెటైర్లు విసిరాడు.. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు సారథ్య బాధ్యతలు వహిస్తున్న కోహ్లీపై విమర్శలు గుప్పించాడు.

టీమ్‌ కూర్పుపై కోహ్లీకి అవగాహన లేదన్న గంభీర్‌
Follow us
Balu

|

Updated on: Sep 14, 2020 | 2:43 PM

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ సెటైర్లు విసిరాడు.. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు సారథ్య బాధ్యతలు వహిస్తున్న కోహ్లీపై విమర్శలు గుప్పించాడు.. టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నా తన అత్యుత్తమ ఎలెవన్‌ జట్టు ఎలా ఉండాలో కోహ్లీకి తెలియదని చెప్పాడు గంభీర్‌.. ఫైనల్‌ ఎలెవన్‌ గురించి అతడు ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదన్నాడు.. ఆ మాటకొస్తే జట్టు ఎంపికపై కోహ్లీకి పెద్దగా అవగాహన లేదని ఒక్క ముక్కతో తేల్చిపారేశాడు గంభీర్‌.. బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంటే సరిపోతుందనుకుంటాడే తప్ప బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ గురించి ఆలోచించడని అన్నాడు. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కనీసం ఆరేడు మ్యాచ్‌ల వరకు ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచుతుందని, వారినే కొనసాగిస్తూ ఉంటుందని గంభీర్‌ అన్నాడు.. అదే కోహ్లీ నేతృత్వంలోని ఆర్‌సీబీ మాత్రం ఆటగాళ్లను వెంట వెంటనే మారుస్తూ వారిలో కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ తగ్గేలా చేస్తుందని చెప్పాడు.. ధోనీ, కోహ్లీ మధ్య ఉన్న తేడా ఇదేనని అన్నాడు గంభీర్‌. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎందుకు సక్సెసవ్వడానికి, ఆర్‌సీబీ జట్టు ఫెయిలవ్వడానికి ఇదే కారణమని చెప్పాడు. మ్యాచ్‌ మ్యాచ్‌కు ఆటగాళ్లను మారుస్తూ ఉంటే వారిలో నిలకడ పోతుందన్నాడు. ఇప్పటికైనా కోహ్లీ తన పొరపాటు తెలుసుకుని, ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆటగాళ్లను మార్చకుండా ఉండాలని సలహా ఇచ్చాడు. ఈ టోర్నమెంట్‌లో నైనా ఫైనల్‌ ఎలెవన్‌ కూర్పు గురించి కచ్చితమైన ప్లానింగ్‌తో బరిలోకి దిగాలని కోహ్లీకి సూచించాడు గౌతం గంభీర్‌..