రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారాన్ని అందజేశారు. అయితే ఈ కార్యక్రమానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ హాజరుకాలేదు. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. కాగా, రాహుల్‌కు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. రాహుల్ రాకపోవడంతో ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ అవార్డు ప్రధానోత్సవంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువులు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, భూపేందర్ సింగ్ హుడా, జనార్ధన్ ద్వివేది, ఆర్పీఎన్ సింగ్, సుష్మిత దేవ్, శశిథరూర్‌లు కూడా హాజరయ్యారు.