గాంధీ జూనియర్ డాక్టర్ల ఆందోళన విరమణ

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు ఫలించడంతో ఆందోళన విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు.

గాంధీ జూనియర్ డాక్టర్ల ఆందోళన విరమణ

Updated on: Jun 10, 2020 | 7:42 PM

ఎట్టకేలకు గాంధీ అస్పత్రి జూనియర్ డాక్టర్లు ఆందోళన విరమించారు. నిన్న రాత్రి పేషేంట్ తరుపు బంధువుల దాడితో నిరసన తెలుపుతున్న వైద్యులు.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు ఫలించడంతో ఆందోళన విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. జూడాల డిమాండ్లపై మంత్రి ఈటల సానుకూలంగా స్పందించారు. వైద్యుల పై దాడి జరిగితే ఎవరిని ఉపేక్షించబోమని భరోసా ఇవ్వడంతో తిరిగి జూడాలు విధుల్లో చేరుతున్నారు. ప్రధానంగా ఐదు డిమాండ్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే డాక్టర్లతో మంత్రి ఈటల మరోదఫా చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర పరిస్థితులు, సమస్యలపై అడిగి తెలుసుకుంటున్నారు మంత్రి.

Loading...
Unable to load recommendations.
Follow Us