‘గల్వాన్​’ ఘటన : మరో భారత సైనికుడి​ వీరమరణం..దేశం మ‌ర‌వ‌దు నీ త్యాగం

|

Jun 25, 2020 | 4:38 PM

భార‌త్- చైనాల మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో త‌లెత్తిన ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో లద్దాఖ్‌లోని బార్డ‌ర్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది ఇండియా.

గల్వాన్​ ఘటన : మరో భారత సైనికుడి​ వీరమరణం..దేశం మ‌ర‌వ‌దు నీ త్యాగం
Follow us on

భార‌త్- చైనాల మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో త‌లెత్తిన ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో లద్దాఖ్‌లోని బార్డ‌ర్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది ఇండియా. మ‌రోవైపు తూర్పు లద్ధాఖ్​లోని గాల్వన్ వ్యాలీ వ‌ద్ద‌ చైనా దాష్టీకంతో జ‌రిగిన ఘర్షణలో తాజాగా మరొక భారత జవాన్ వీర‌మ‌ర‌ణం పొందారు. మహారాష్ట్ర మాలేగావ్​కు చెందిన సచిన్​ విక్రమ్​కు గల్వాన్​ ఘర్షణలో తీవ్ర‌ గాయాలయ్యాయి. లేహ్​ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయన గురువారం అమ‌రుడ‌య్యారు.

జూన్ 15 రాత్రి తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో భారత్​-చైనా దేశాల మధ్య ఘర్షణ తలెత్తిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఈ రోజు మ‌ర‌ణించిన జ‌వాన్ తో క‌లిపి మొత్తం 21 మంది భారత సైనికులు అమ‌రుల‌య్యారు. చైనా వైపు కూడా ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్టు సమాచారం. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్ర‌రూపం తాల్చాయి. లద్దాఖ్ స‌రిహ‌ద్దుల్లో యుద్ద‌మేఘాలు కమ్ముకున్నాయి.