సోమాజిగూడలో రోడ్డుప్రమాదం.. అదుపుతప్పిన జీపు బోల్తా.. నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

|

Dec 24, 2020 | 4:31 AM

హైదరాబాద్ మహానగరంలో మితిమీరిన వేగం నలుగురిని ఆస్పత్రిపాలు చేసింది. సోమాజిగూడ నుండి రాజ్‌భవన్ సమీపంలో జీప్ బోల్తా పడింది.

సోమాజిగూడలో రోడ్డుప్రమాదం.. అదుపుతప్పిన జీపు బోల్తా.. నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
Follow us on

హైదరాబాద్ మహానగరంలో మితిమీరిన వేగం నలుగురిని ఆస్పత్రిపాలు చేసింది. సోమాజిగూడ నుండి రాజ్‌భవన్ వెళ్ళే ప్రధాన రహదారిలో అతివేగంగా వచ్చిన జీప్ రోడ్ పక్కనే ఉన్న దర్గాను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా జీప్ బోల్తా పడింది. జీపులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనాకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.