విశాఖలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు ఆత్మహత్య

విశాఖ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక భారంతో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధలు తాళలేక ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని ఓ లాడ్జిలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

విశాఖలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు ఆత్మహత్య

Updated on: Sep 10, 2020 | 6:59 AM

విశాఖ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక భారంతో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందిం. అప్పుల బాధలు తాళలేక ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని ఓ లాడ్జిలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పెందుర్తి శివారు బంధుపాలెంకు చెందిన బి.అప్పలరాజు కుటుంబంగా పోలీసులు తెలిపారు. అప్పలరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల ఓ లాడ్జ్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.

వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చలేక భారంతో భార్య మానస, కుమారుడు సాత్విక్‌ (5), కుమార్తె కీర్తి (6)తో కలిసి ఆత్మహత్యకు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారి మరణానికి కారణంగా పేర్కొంటూ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అప్పలరాజు బంధువులకు ద్వారకానగర్‌ పోలీసులు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సూసైడ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us