నిజామాబాద్‌ను నేను వదలను.. – కవిత

సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన కల్వకుంట్ల కవిత అనూహ్యంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక ఆమె తన ఓటమిపై తొలిసారి స్పందించారు.. తన నియోజకవర్గ పరిధిలోని మంచిప్పలో గుండెపోటుతో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమేనని.. తాను నిజామాబాద్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీకి మొగ్గు చూపించారన్నారు. అలాగే ఎన్నికల్లో […]

నిజామాబాద్‌ను నేను వదలను.. - కవిత
Follow us

|

Updated on: May 27, 2019 | 3:41 PM

సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన కల్వకుంట్ల కవిత అనూహ్యంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక ఆమె తన ఓటమిపై తొలిసారి స్పందించారు.. తన నియోజకవర్గ పరిధిలోని మంచిప్పలో గుండెపోటుతో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమేనని.. తాను నిజామాబాద్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీకి మొగ్గు చూపించారన్నారు. అలాగే ఎన్నికల్లో గెలిచిన వారు ప్రజల హామీలు నెరవేర్చాలని సూచించారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన టీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని కవిత పిలుపునిచ్చారు.  తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానని చెప్పిన ఆమె.. బంగారు తెలంగాణ కోసం అందరం కలిసి పని చేయాలని  కార్యకర్తలకు సూచించారు.

Latest Articles