తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముఖేశ్ గౌడ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉన్నారు.
వైఎస్ హయాంలో ముఖేష్ గౌడ్ మంత్రిగా పనిచేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గోషా మహల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ముఖేష్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో మార్కెంటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ నేత దేవేందర్ గౌడ్‌కు ఆయన సమీప బంధువు.