విషాదం : భారత మాజీ క్రికెట‌ర్ మృతి

|

Sep 16, 2020 | 10:41 AM

భారత మాజీ క్రికెటర్‌ సదాశివ్‌ రావ్‌జీ పాటిల్(86)‌ తుదిశ్వాస విడిచారు. కొల్హాపూర్‌లోని రుయ్‌కార్ కాల‌నీలోగ‌ల‌ త‌న నివాసంలో  మంగళవారం  తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లు కొల్హాపూర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం మాజీ అధికారి రమేశ్‌ కదమ్‌ వివరించారు.

విషాదం : భారత మాజీ క్రికెట‌ర్ మృతి
Follow us on

భారత మాజీ క్రికెటర్‌ సదాశివ్‌ రావ్‌జీ పాటిల్(86)‌ తుదిశ్వాస విడిచారు. కొల్హాపూర్‌లోని రుయ్‌కార్ కాల‌నీలోగ‌ల‌ త‌న నివాసంలో  మంగళవారం  తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లు కొల్హాపూర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం మాజీ అధికారి రమేశ్‌ కదమ్‌ వివరించారు. మీడియం పేసర్‌ అయిన పాటిల్‌… 1955లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరుఫున బరిలోకి దిగారు. ఇండియా‌ తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడిన 79వ ఆటగాడిగా నిలిచిన ఆయనకు, ఆ త‌ర్వాత తిరిగి ఎప్పుడూ దేశానికి ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం ద‌క్క‌లేదు.  పాటిల్‌కు భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు.

పాటిల్‌ మృతిపై స్పందించిన బీసీసీఐ ‘న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాటిల్‌ కొత్త బంతితో అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్లను దక్కించుకున్న ఆయన… మ్యాచ్‌లో ఇండియా‌ ఇన్నింగ్స్, 27 రన్స్ తేడాతో గెలవడంలో తన వంతు సహకారం అందించాడు.’అని పేర్కొంది. అనంతరం లాంక్‌షైర్‌ లీగ్‌లో 1959 నుంచి 1961 వరకు రెండు సీజన్‌ల్లో 52 మ్యాచ్‌ల్లో ఆడి… 111 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మహారాష్ట్ర తరఫున 1952–64 మధ్య  36 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 866 పరుగులు చేసిన పాటిల్‌… 83 వికెట్లు తీశారు. అంతేకాదు‌, పాటిల్ ఒక రంజీ ట్రోఫీలో మ‌హారాష్ట్ర రంజీ జ‌ట్టుకు కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు.

Also Read :విచారణకు పిలిస్తే, మాజీ రౌడీషీటర్ ఆగమాగం