ఉపరాష్ట్రపతి కార్యదర్శిగా ఐవీ సుబ్బారావు

| Edited By:

Jun 12, 2019 | 8:07 AM

ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కార్యదర్శిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఐవీ సుబ్బా రావు పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ప్రతిపాదనకు నియామకాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్రవేయడంతో మంగళవారం సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కాంట్రాక్టు పద్ధతిలో కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి హోదాను కల్పించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య పదవీకాలం ముగిసే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సుబ్బారావు కార్యదర్శిగా కొనసాగుతారని స్పష్టం చేసింది. 1979 ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన […]

ఉపరాష్ట్రపతి కార్యదర్శిగా ఐవీ సుబ్బారావు
Follow us on

ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కార్యదర్శిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఐవీ సుబ్బా రావు పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ప్రతిపాదనకు నియామకాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్రవేయడంతో మంగళవారం సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కాంట్రాక్టు పద్ధతిలో కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి హోదాను కల్పించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య పదవీకాలం ముగిసే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సుబ్బారావు కార్యదర్శిగా కొనసాగుతారని స్పష్టం చేసింది. 1979 ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐవీ సుబ్బారావు ప్రకాశం జిల్లా వాసి. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. యునెస్కోలో కొంతకాలం పని చేసిన ఐవీ సుబ్బారావు.. అంతకుముందు ఉమ్మడి ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా, టీటీడీ ఈవోగా, విద్య, వైద్య శాఖల ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.