మళ్లీ పోలీసులకు చిక్కిన మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి

|

Sep 28, 2020 | 7:34 PM

గత నెల నాచారం లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న నాగమళ్ల వెంకట నరసయ్య కేసులో మాజీ ఏఎస్‌ఐ మోహనరెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మళ్లీ పోలీసులకు చిక్కిన మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి
Follow us on

గత నెల నాచారం లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న నాగమళ్ల వెంకట నరసయ్య కేసులో మాజీ ఏఎస్‌ఐ మోహనరెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఏఎస్‌ఐ మోహనరెడ్డితో పాటు చిట్టుమల్ల శ్రీనివాస్, నాగభూషణ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఫ్లాటును అక్రమంగా మోహనరెడ్డి భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని కరీంనగర్‌కు చెందిన నాగమళ్ల వెంకట నరసయ్య ఆరోపించాడు. ఇదే అంశానికి సంబంధించి వెంక‌ట న‌ర్స‌య్య పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై గతంలో ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. అయిన న్యాయం జరగలేదని భావించిన నరసయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కాగా, గత నెల 28 నాచారంలోని ఓ లాడ్జిలో సూసైడ్ నోట్ రాసిన నరసయ్య పురుగులమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోహనరెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని నాచారం పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపులు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఎఎస్ఐ మోహన్ రెడ్డి పై గతం లో కరీంనగర్ ఎసీబీ, సీఐడీ పలు కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ లోని వివిధ పోలీసుస్టేషన్ ల్లో కుడా మని ల్యాండరింగ్ కేసులు, ఛీటింగ్ కేసులు నమోదు అయ్యాయి. దాదాపు రెండు సంవత్సరాలు జైలుకి వెళ్ళిన మోహన్ రెడ్డి ఇటీవలే బెయిలు పై వచ్చాడు.