చిరుత జాడ దొరికేసింది.. ఎక్కడ ఉందంటే!

| Edited By: Pardhasaradhi Peri

May 19, 2020 | 11:17 AM

హైదరాబాద్ నగర శివారులో చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన నగర శివారులో కాటేదాన్ ప్రాంతంలో అండర్ బ్రిడ్జి దగ్గర గాయాలతో...

చిరుత జాడ దొరికేసింది.. ఎక్కడ ఉందంటే!
Follow us on

హైదరాబాద్ నగర శివారులో చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన నగర శివారులో కాటేదాన్ ప్రాంతంలో అండర్ బ్రిడ్జి దగ్గర గాయాలతో ఓ చిరుత కనిపించింది. అయితే అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేలోపే అక్కడి నుంచి పారిపోయింది. ఈ క్రమంలో ఓ లారీ డ్రైవర్‌ను కూడా గాయపరిచింది. అలాగే రోడ్డు పక్కనే ఉన్న ఫామ్ హౌస్‌లోకి వెళ్లిన చిరుత అక్కడి నుంచి కూడా తప్పించుకొని వ్యవసాయ విశ్వ విద్యాలయం యూనివర్శిటీలోని దట్టమైన పొదల్లోకి వెళ్లిపోయింది. ఆ రోజు నుంచి దాని కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తూనే ఉన్నారు.

అయితే ఈ రోజు ఉదయం చిరుత రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని హిమాయత్ సాగర్ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లో ప్రత్యక్షం అయ్యింది. చిరుత స్విమ్మింగ్ ఫూల్‌లో నీళ్లు తాగుతుండగా ఆ గార్డెన్ వాచ్ మెన్ గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన అధికారులు చిరుతను బంధించేందుకు.. ఆ గార్డెన్‌లోకి కుక్కలను వదిలిపెట్టారు.

ఇది కూడా చదవండి: 

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి

క్వారంటైన్‌లో ఉన్న యువకుడి ఆత్మహత్య.. కారణం ఇదే!