కొత్త కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనాతో పూర్తిగా కోలుకోక ముందే ఈ కొత్త స్ట్రైయిన్ వైరస్ తో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ – బ్రిటన్ మధ్య విమానాల రాకపోకలు మరి కొంత కాలం నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి సూత్రప్రాయంగా వెల్లడించారు. బ్రిటన్ కు విమాన సర్వీసులపై తాత్కాలిక రద్దు ఇంకొంత కాలం ఉండవచ్చని అనుకుంటున్నా.. అయితే ఈ పొడిగింపు సుదీర్ఘంగా లేదా నిరవధికంగా ఉండకపోవచ్చు అని అన్నారు. అయితే భారత్ లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూస్తుండటం, యూకేలో వైరస్ మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
కాగా, జన్యుమార్పిడి చెందిన కరోనా వైరస్ బ్రిటన్ లో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. భారత ప్రభుత్వం కూడా ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు బ్రిటన్ కు విమానాల రాకపోకలను రద్దు చేసింది. అయితే డిసెంబర్ 23లోగా దేశానికి చేరుకున్న వారికి విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో పలువురికి కరోనా పాజిటివ్ తేలింది. అయితే వీరికి సోకింది కరోనా కొత్త వైరసా ? కాదా.. అనే విషయాన్ని తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్ లను పంపించారు. అయితే ఈ పరీక్షల్లో ఇప్పటి వరకు ఆరుగురికి కొత్త రకం స్ట్రైయిన్ వైరస్ నిర్ధారణ అయినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
Also Read: