జీమెయిల్ అకౌంట్‏తో మీ పర్సనల్ డేటా గూగుల్‏‏ తీసుకుంటుందని సందేహామా ? అయితే ఈ ట్రిక్స్ పాటిస్తే మీరు సేఫ్..

|

Jan 23, 2021 | 7:43 PM

సాధరణంగా స్మార్ట్ ఫోన్స్ వాడే ప్రతి ఒక్కరు తమ మొబైల్స్‏లో జీమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతారు. దీంతో గూగుల్ తమ యూజర్ల డేటా మొత్తాన్ని సేవ్ చేసుకుంటుంది. మీరు ఏం సెర్చ్ చేశారు ?

జీమెయిల్ అకౌంట్‏తో మీ పర్సనల్ డేటా గూగుల్‏‏ తీసుకుంటుందని సందేహామా ? అయితే ఈ ట్రిక్స్ పాటిస్తే మీరు సేఫ్..
Follow us on

సాధరణంగా స్మార్ట్ ఫోన్స్ వాడే ప్రతి ఒక్కరు తమ మొబైల్స్‏లో జీమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతారు. దీంతో గూగుల్ తమ యూజర్ల డేటా మొత్తాన్ని సేవ్ చేసుకుంటుంది. మీరు ఏం సెర్చ్ చేశారు ? ఎప్పుడు ఎక్కడ ఉన్నారు? మీ యూట్యూబ్‏లో ఏం వీడియోలు చూశారు ? అనే విషయాలన్ని గూగుల్ తమ డేటా సర్వర్లలో సేవ్ చేసుకుంటుంది. కానీ కొంతమందికి అది నచ్చదు. పర్సనల్ డేటాను గూగుల్ షేర్ చేసుకోకుండా ఉండాలంటే.. స్టోర్ చేసిన డేటాను ఇలా డెలీట్ చేయండి.

ఇందుకోసం గూగుల్ ఓ యాక్టివిటీ డేటా టూల్ తీసుకొచ్చింది. ముందుగా గూగుల్ పేజీలో google.com విజిట్ చేయాలి. ఆ తర్వాత జీమెయిల్ అకౌంటుతో లాగిన్ అవ్వాలి. అనంతరం రైట్ టైప్ కార్నర్‏లో ఉన్న ఒక సర్కిల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. తర్వాత manage your google account ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత data & personalization ఆప్షన్ కింద ఉన్న యాక్టివిటీ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. ఈ యాక్టివిటీ అండ్ టైమ్ లైన్ కింద మై యాక్టీవిటీ అనే బటన్ పై క్లిక్ చేయాలి.

గూగుల్ స్టోర్ చేసిన పర్సనల్ డేటాను డేలీట్ చేయడం..
ముందుగా గూగుల్ పేజీలో google.com విజిట్ చేయాలి. ఆ తర్వాత జీమెయిల్ అకౌంటుతో లాగిన్ అవ్వాలి. అనంతరం రైట్ టైప్ కార్నర్‏లో ఉన్న ఒక సర్కిల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. తర్వాత manage your google account ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత data & personalization ఆప్షన్ కింద ఉన్న యాక్టివిటీ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. లెఫ్ట్ నేవిగేషన్ ప్యానెల్ పక్కన data & personalization ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Web & App Activity ఆప్షన్ సెలక్ట్ చేసి manage activityని సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీ డేటా యాక్టివిటీకి సంబంధించిన ఓక లిస్ట్ కనిపిస్తుంది. తర్వాత మూడు డాట్ల ఐకాన్ సెలెక్ట్ చేసాక డెలీట్ బటన్ పై క్లిక్ చేయాలి. అందులో ఆటో డెలీట్ ఆప్షన్ కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇక దీనిని మూడు నెలల నుంచి పద్దెనమిది నెలల వరుక కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.

గూగుల్ ట్రాక్ చేయకుండా ఇలా చేయ్యొచ్చు..
ఇందుకు ముందుగా గూగుల్ పేజీలో google.com విజిట్ చేయాలి. ఆ తర్వాత జీమెయిల్ అకౌంటుతో లాగిన్ అవ్వాలి. అనంతరం రైట్ టైప్ కార్నర్‏లో ఉన్న ఒక సర్కిల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. తర్వాత manage your google account ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత data & personalization ఆప్షన్ కింద ఉన్న యాక్టివిటీ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. అందులో web & app activity tracking, location history, YouTube history ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీ డేటాను ట్రాక్ చేయకుండా ఉండాలంటే చెక్ మార్క్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.

Also Read:

మీ మొబైల్ ఫోన్ల‏లో పర్సనల్ డేటాను సేవ్ చేసుకుంటున్నారా ? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..

UPI: మీరు ‘యూపీఐ’ ద్వారా పేమెంట్స్‌ చేస్తుంటారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. కీలక ప్రకటన చేసిన ఎన్‌పీసీఐ…