డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలిః నిర్మలా సీతారామన్

|

Nov 10, 2020 | 9:22 PM

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలిః నిర్మలా సీతారామన్
Follow us on

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి 31, 2021 నాటికి అన్ని బ్యాంకుల ఖాతాలను సంబంధిత వినియోగదారుల ఆధార్ కార్డు నెంబర్లతో అనుసంధానించేలా చూడాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బ్యాంకులకు సూచించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 73 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి ప్రసంగించారు. డిజిటల్ కాని చెల్లింపులను బ్యాంకులు అనుమతించవద్దని ఆమె తెలిపారు. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ చర్చలు తప్పవని ఆమె అన్నారు. ఆధార్‌తో సంబంధం లేని చాలా ఖాతాలు ఉన్నాయి. వీటన్నింటిని క్రమబద్ధీకరించాలన్నారు. డిజిటల్ చెల్లింపుల పద్ధతులను ప్రోత్సహించాలన్న నిర్మలా సీతారామన్ .. యుపిఐ నడిచే అనేక చెల్లింపులను కూడా అవలంబించాలని ఆమె వెల్లడించారు. బ్యాంకులు రుపే కార్డులను ప్రోత్సహించాలని కోరారు.