‘నన్నే ప్రశ్నిస్తారా.? వాళ్లను ఉరి తీయండి’

|

Sep 13, 2020 | 4:12 PM

ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జనమెరిగిన సత్యం. ఆయన వేసే శిక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నన్నే ప్రశ్నిస్తారా.? వాళ్లను ఉరి తీయండి
Follow us on

North Korea News: ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జనమెరిగిన సత్యం. ఆయన వేసే శిక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో చంపించాడని అప్పట్లో అనేక వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా తన పరిపాలనపై విమర్శలు గుప్పించారని ఐదుగురు అధికారులను ఉరి తీయించాడు ఈ నార్త్ కొరియా డిక్టేటర్. ఇక ఈ విషయాన్ని అక్కడి వార్తా పత్రికలు హోరెత్తించాయి.

ఓ డిన్నర్ పార్టీలో సదరు ఆర్ధిక శాఖ అధికారులు.. కిమ్ జోంగ్ ఉన్ పరిపాలనా విధానాలను విమర్శించడమే కాకుండా.. వాటి వల్ల నార్త్ కొరియా ప్రపంచంలోని పేద దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. దేశంలో స్థిరమైన ఆర్థిక వ్యవస్థతో పాటు పారిశ్రామిక సంస్కరణ ఎంతగానో అవసరమని పేర్కొన్నారు. అంతేకాదు అమలులో ఉన్న ఆర్ధిక ఆంక్షలు ఎదుర్కోవాలంటే విదేశీ సహకారం కోరాలని కూడా సూచించారు. దీనితో ఆగ్రహానికి గురైన కిమ్.. ఆ ఐదుగురు అధికారులను ఉరి తీయాలని సైన్యాన్ని ఆదేశించాడు. ఇక వారికి జూలై 30వ తేదీన ఉరి తీసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.