యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు.అదే జోష్ లో ఇప్పుడు వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో’రంగ్ దే’అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.
ఇటీవలే చిత్రయూనిట్ దుబాయ్ వెళ్లారు.ఇక అక్కడ షూటింగ్ జరుగుస్తున్న సమయంలో తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడి తెలుగువారు ఈ ఫోటోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు.ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి.ఈ సినిమాతోపాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో’చెక్’ అనే సినిమా చేస్తున్నాడు నితిన్.