తొలిసారి మానవాళి ముందుకు “కృష్ణ బిలం” చిత్రం

| Edited By:

Apr 10, 2019 | 10:06 PM

వాషింగ్టన్‌: ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు ఓ అద్భుతాన్ని ఆవిష్క‌రించారు. బ్లాక్‌హోల్ అని పిలువ‌బ‌డే కృష్ణ బిలాన్ని మొద‌టిసారి ఫోటో తీశారు. సుదూర పాల‌పుంత‌ల మ‌ధ్య ఆ కృష్ణ బిలం ఉన్న‌ట్లు గుర్తించారు. ఆ బ్లాక్‌హోల్‌కు సంబంధించిన ఫోటోను ఇవాళ రిలీజ్ చేశారు. ఆ బిలం సుమారు 40 బిలియ‌న్ల కిలోమీట‌ర్ల వెడ‌ల్పు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అంటే ఇది భూమి క‌న్నా సుమారు 30 ల‌క్ష‌ల రేట్ల పెద్ద సైజులో ఉంద‌న్న‌మాట‌. ఈ బ్లాక్‌హోల్ భూమికి సుమారు 500 […]

తొలిసారి మానవాళి ముందుకు కృష్ణ బిలం చిత్రం
Follow us on

వాషింగ్టన్‌: ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు ఓ అద్భుతాన్ని ఆవిష్క‌రించారు. బ్లాక్‌హోల్ అని పిలువ‌బ‌డే కృష్ణ బిలాన్ని మొద‌టిసారి ఫోటో తీశారు. సుదూర పాల‌పుంత‌ల మ‌ధ్య ఆ కృష్ణ బిలం ఉన్న‌ట్లు గుర్తించారు. ఆ బ్లాక్‌హోల్‌కు సంబంధించిన ఫోటోను ఇవాళ రిలీజ్ చేశారు. ఆ బిలం సుమారు 40 బిలియ‌న్ల కిలోమీట‌ర్ల వెడ‌ల్పు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అంటే ఇది భూమి క‌న్నా సుమారు 30 ల‌క్ష‌ల రేట్ల పెద్ద సైజులో ఉంద‌న్న‌మాట‌. ఈ బ్లాక్‌హోల్ భూమికి సుమారు 500 మిలియ‌న్ల ట్రిలియ‌న్ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించి ఉన్న 8 భారీ టెలిస్కోప్‌ల నెట్‌వ‌ర్క్‌కు ఈ బ్లాక్ హోల్ ఫోటో చిక్కింది. ఆస్ట్రోఫిజిక‌ల్ జ‌ర్న‌ల్ లెట‌ర్స్‌లో ఈ బిలం వివ‌రాల‌ను వెల్ల‌డించారు. నెద‌ర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ హీనో ఫాల్కే ఈ బ్లాక్ హోల్ గురించి వివ‌ర‌ణ ఇచ్చారు. ఎం87 అని పిలువ‌బ‌డే గెలాక్సీలో కృష్ణ బిలం ఉన్న‌ట్లు గుర్తించామ‌న్నారు. ఆ కృష్ణ బిలం సైజు.. మ‌న సౌర వ్య‌వ‌స్థ క‌న్నా పెద్ద‌గా ఉంద‌న్నారు. సూర్యుడి కంటే సుమారు 6.5 బిలియ‌న్ల రేట్లు ఎక్కువ పెద్ద సైజులో ఉన్న‌ది. ప్ర‌స్తుతం సువిశాల రోద‌సీలో ఉన్న అత్యంత భార‌మైన బ్లాక్ హోల్‌గా దీన్ని భావిస్తున్నారు. కృష్ణ బిలం చుట్టు భారీ ఎత్తున్న మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. క‌నీసం వెలుతురు కూడా వెళ్ల‌ని ప్రాంతాన్ని శాస్త్ర‌వేత్త‌లు కృష్ణ బిలంగా పేర్కొంటున్నారు. ఆ కృష్ణబిలం నీడను సంగ్రహించడం అత్యంత కష్టమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కృష్ణబిలం దృశ్యాన్ని చిత్రీకరించడం శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు వెలుగులోకి తేవడానికి ఈ ఆవిష్కరణ దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.