
చెన్నైలోని టీనగర్‌లోగల నడిగర్ సంఘం కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో కీలక పత్రాలతో పాటు కొన్ని వస్తువులు కూడా అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తుంది. ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా నాజర్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉండగా, విశాల్ కార్యదర్శిగా ఉన్న సమయంలో నిధులకి సంబంధించిన అన్నీ ఫైల్స్ కార్యాలయంలోనే ఉన్నాయి. అవన్నీ ప్రమాదంలో కాలిపోయాయని అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.