ఆఫ్ఘన్‌లో బాంబు పేలుడు.. 15 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు

|

Dec 18, 2020 | 7:36 PM

ఆప్ఘనిస్తాన్‌ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. తూర్పు ఆప్ఘనిస్తాన్‌లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది పౌరులు మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.

ఆఫ్ఘన్‌లో బాంబు పేలుడు.. 15 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు
Follow us on

ఆప్ఘనిస్తాన్‌ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. తూర్పు ఆప్ఘనిస్తాన్‌లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది పౌరులు మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. దాదాపు 20 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మతపరమైన కార్యక్రమం జరుగుతుండగా బాంబు పేలుడు జరిగినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తారీఖ్ అరియన్ వెల్లడించారు.

గిలాన్ జిల్లాలోని గజినీ ప్రావిన్స్‌లో ఓ ఇంట్లో మతపరమైన కార్యక్రమం జరుగుతుండగా.. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా, ఈ పేలుడుకు కారణం తాలిబన్ల పనేనని భద్రతా బలగాలు ప్రాథమికంగా భావిస్తున్నాయి. గజినీ ప్రావిన్స్‌లో ప్రభుత్వ బలగాలకు, తాలిబన్లకు నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంది. ఆ ప్రాంతం కాల్పుల మోతతో అట్టుడుకుతూనే ఉంది.