దేశ రైతులు ప్రధాని మోదీని విశ్వసించబోరు, ఆయన అన్నదాత వ్యతిరేకి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్,

| Edited By: Anil kumar poka

Dec 30, 2020 | 9:43 PM

రైతులు ప్రధాని మోదీని విశ్వసించబోరని, ఆయన రైతు వ్యతిరేకి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అన్నదాత వ్యతిరేక చట్టాలను రద్దు చేసేందుకు మోదీ నిరాకరిస్తున్నారని...

దేశ రైతులు ప్రధాని మోదీని విశ్వసించబోరు, ఆయన అన్నదాత వ్యతిరేకి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్,
Follow us on

రైతులు ప్రధాని మోదీని విశ్వసించబోరని, ఆయన రైతు వ్యతిరేకి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అన్నదాత వ్యతిరేక చట్టాలను రద్దు చేసేందుకు మోదీ నిరాకరిస్తున్నారని, ఇందుకు కారణమేమిటో అందరికీ తెలిసిందేనని ఆయన ట్వీట్ చేశారు. ఈ చట్టాలను అయన ఎందుకు ఉపసంహరించుకోవడంలేదో ప్రజలను కోరుతూ రాహుల్ ఓ ఆన్ లైన్ సర్వే ను షేర్ చేశారు. ‘ప్రతి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు, ప్రతి ఏడాదీ 2 కోట్ల ఉద్యోగాలు అంటూ మోదీ ఎన్నో హామీలు ఇస్తుంటారని రాహుల్ అన్నారు. ప్రస్తుతం ఈయన విదేశీ పర్యటనలో ఉన్న విషయం గమనార్హం. తన గ్రాండ్ మదర్ ని చూసేందుకు ఆయన మిలన్ (ఇటలీ) వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా ఈ దేశంలో రైతులను మోసగించడం అన్నది కొత్త నార్మల్ పద్దతిగా మారిందని ఈ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. ఇండియాలో ఇప్పుడిది నూతన విధానంలా మారినట్టు కనిపిస్తోందన్నారు. మూడు నల్ల చట్టాలను వారు సమర్థిస్తున్నారని, మీడియాలో ఓ వర్గం కూడా దీనికి మద్దతునిస్తోందని సూర్జేవాలా   విమర్శించారు. ఈ వైఖరిని ప్రతి భారతీయుడూ ప్రశ్నించాలని ఆయన కోరారు.