Grand Welcome To Baby Girl : బుజ్జితల్లి ఇంట అడుగుపెట్టిన శుభ ముహూర్తాన మనసులు ఎంత పులకించెనో !

ఆడపిల్లంటే సమాజంలో ఎంత వివక్ష ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టాక కాదు..అమ్మ కడుపులోనే ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది. ఆడపిల్లని తెలిస్తే..

Grand Welcome To Baby Girl : బుజ్జితల్లి ఇంట అడుగుపెట్టిన శుభ ముహూర్తాన మనసులు ఎంత పులకించెనో !

Updated on: Dec 27, 2020 | 4:21 PM

ఆడపిల్లంటే సమాజంలో ఎంత వివక్ష ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టాక కాదు..అమ్మ కడుపులోనే ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది. ఆడపిల్లని తెలిస్తే..ముందుగానే అబర్షాన్లు చేయిస్తున్న ఆటవిక సమాజంలో బ్రతుకుతున్నాం. కానీ తెలియాల్సింది ఏంటి అంటే..ఈ రోజు ఒక కొడుకుగా ఉన్నా, రేపు మరో కొడుకును కనాలన్నా కావాల్సిందే స్త్రీనే. ఆడవాళ్లు లేకపోతే సృష్టి ముందుకు సాగదు. ఆడపిల్ల పుడితే ఆస్పత్రి నుంచి వచ్చే దారి మధ్యలోనే వదిలేసిన ఘటనలు చూశాం. ఆడపిల్ల పుట్టిందని..భర్త వదిలేసిన అమానుషాల గురించీ విన్నాం.  ఆస్పత్రిలో బిడ్డను వదిలేసి వెళ్లిన దాఖలాలు చూశాం. కానీ ఆడిపిల్లను కన్న కోడలిపై పూల వర్షం కురిపించి ఆహ్వానించిన సందర్భం ఎప్పుడైనా మీకు తారసపడిందా..?…అటువంటి ఘటనను ఎంతో గర్వంతో మీముందు ఉంచబోతుంది టీవీ9 .

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన వెలిశాల నవీన్‌, రమ్య దంపతులు. వీరికి మూడేళ్ల క్రితం పెళ్లైంది. రమ్య మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో ఆడబిడ్డకు జన్మనివ్వగా..ఆ తర్వాత పుట్టింటికి వెళ్లింది. ఆ బుజ్జితల్లి తమ ఊరికి వచ్చే అపూర్వ ఘట్టం కోసం నవీన్‌ తల్లి, కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. శుక్రవారం రమ్య తన బిడ్డను తీసుకొని కేసముద్రంలోని అత్తరింటికి రాగా ఎవరూ ఊహించని విధంగా పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. మహాలక్ష్మి తమ ఇంటికి వచ్చిందన్న ఆనందంతో ఇంటి బయట నుంచి లోపలి గది వరకు తల్లీబిడ్డను పూల బాటపై నడిపించారు. మంచంపై పూలను అందంగా పేర్చి మధ్యలో బిడ్డను పడుకోబెట్టి ఆనందపడ్డారు. అత్తింటివారు చూపించిన ప్రేమకు రమ్య పడిన సంతోషం అంతా..ఇంతా కాదు.

Also Read :

Rajinikanth Health Update : ఆల్ క్లియర్.. ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..ఆనందంలో అభిమానులు

 మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం