ఇకపై ఒమన్‌లో ప్రవాసీలు ఆస్తుల కొనుగోలుకు అవకాశం..!

ఒమన్‌ దేశ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆదేశస్థులకే పరమితమైన ఆస్తుల క్రయవిక్రయాలు.. ఇకపై ప్రవాసులకు అక్కడి సర్కార్ ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.

ఇకపై ఒమన్‌లో ప్రవాసీలు ఆస్తుల కొనుగోలుకు అవకాశం..!

Updated on: Oct 19, 2020 | 4:20 PM

ఒమన్‌ దేశ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆదేశస్థులకే పరమితమైన ఆస్తుల క్రయవిక్రయాలు.. ఇకపై ప్రవాసులకు అక్కడి సర్కార్ ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. గవర్నరేట్ ఆఫ్ మస్కట్‌లోని బహుళ అంతస్తుల భవనాల్లో అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. గృహ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు తీర్మానాన్ని జారీ చేసింది. నాన్ ఒమానిస్ ఎవరైతే రెండేళ్లుగా సుల్తానేట్‌లో నివాసం ఉంటున్నారో వారు ఆస్తిని కొనుగోలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రాపర్టీలు ప్రభుత్వం పేర్కొన్న సైట్లలోనే ఉంటాయి. అలాగే వీటికి గృహనిర్మాణ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ లైసెన్స్ జారీ చేస్తుంది.

ఇక రిజిస్ట్రేషన్ ఫీజుల విషయానికి వస్తే… విక్రేత చెల్లించే ఫీజులు యూనిట్ విలువలో 3 శాతంగా ఉంటే… లబ్ధిదారునికి యూనిట్ విలువలో 5 శాతంగా ఉంటుంది. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రవాసులను ఆస్తి కొనుగోలు చేయమని ప్రోత్సహించడం తమ లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విధానం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పోటీతో కూడిన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడానికి ఇది దోహదం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి నగదును కూడా ప్రవేశపెడుతుందన్నట్లు ఒమన్ సర్కార్ వెల్లడించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us