మాఘశుద్ధ పౌర్ణమి…తెలంగాణ కేబినెట్ విస్తరణ

ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 11:30 గంటలకు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను  కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఉదయ౦ 11:30కి రాజ్‌భవన్‌లో మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు కేబినెట్‌ కూర్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ మాత్రమే […]

మాఘశుద్ధ పౌర్ణమి...తెలంగాణ కేబినెట్ విస్తరణ

Edited By:

Updated on: Mar 07, 2019 | 8:23 PM

ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 11:30 గంటలకు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను  కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఉదయ౦ 11:30కి రాజ్‌భవన్‌లో మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మరోవైపు కేబినెట్‌ కూర్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ మాత్రమే కేబినెట్‌లో ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో 16 మందికి అవకాశముంది. ఇప్పుడు కొంతమందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకుని మిగతా వారికి లోక్‌సభ ఎన్నికల తర్వాత చోటు కల్పించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం.