గ్రామ సచివాలయాల ప్రారంభంలో అధికారుల అత్యుత్సాహం అధికార పార్టీకి ఎంబర్రాసింగ్ పరిస్థితి క్రియేట్ చేసింది. స్వాగత ఫ్లెక్సీల్లో ఫోటోలకు, వారి హోదాలకు పొంతన లేకపోవడంతో అధికారులు.. వైసీపీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. విజయనగరం జిల్లాలో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. గ్రామ సచివాలయాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోకు మునిసిపల్ కమిషనర్ అన్న ట్యాగ్ వైసీపీ నేతల ఆగ్రహానికి అసలు కారణం. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టి.. కింద మునిసిపల్ కమిషనర్ అని పేర్కొనడంతో అధికారులు వైసీపీ నేతల నుంచి చివాట్లు తినాల్సి వచ్చింది. సీఎం జగన్ ను మున్సిపల్ కమిషనర్ గా పేర్కొన్న అదే ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావును ప్రత్యేక అధికారిగా ప్రస్తావించారు. పార్వతీపురం మున్సిపాలిటీ స్వాగత ఏర్పాట్ల లో తప్పులు తడకలుగా ఫ్లెక్సీలుండడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. అధికారుల పనితీరు, నిర్లక్ష్య ధోరణిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.