Super Electric Bike: యాభై వేలకే సూపర్ ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు నాన్‌స్టాప్‌గా ప్రయాణం.. మైలేజ్ ఎంతిస్తుందో తెలుసా..

Super Electric Bike: వాతావరణ కాలుష్యం వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయో అందరం చూస్తునే ఉన్నాం. అందుకే ప్రకృతిని

Super Electric Bike: యాభై వేలకే సూపర్ ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు నాన్‌స్టాప్‌గా ప్రయాణం.. మైలేజ్ ఎంతిస్తుందో తెలుసా..
Follow us

|

Updated on: Jan 06, 2021 | 4:27 PM

Super Electric Bike: వాతావరణ కాలుష్యం వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయో అందరం చూస్తునే ఉన్నాం. అందుకే ప్రకృతిని కాపాడడానికి పలు సంస్థలు పర్యావరణ హిత ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. గాలి కాలుష్యం చేయకుండా ఉండటానికి పలు ఆటోమోబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ ఉత్పత్తులపై దృష్టి సారించాయి. అందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ చిన్న ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రూపొందించింది. దాని సంగతులేంటో ఇప్పుడు చూద్దాం.

విశాఖ ఇండస్ట్రీస్‌కి చెందిన వంశీ గడ్డం అనే వ్యక్తి మొదటగా ఆటమ్(ATUM) పేరుతో సోలార్-ప్యానల్ ఇంటిగ్రేటెడ్ రూఫింగ్ సిస్టమ్ రూపొందించాడు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వెహిక‌ల్స్‌కు మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌ను చూసి తన టీమ్‌తో కలిసి ఎలక్ట్రిక్ బైక్ తయారీకి పూనుకున్నాడు. ఆయన టీమ్‌లోని పది మంది ఇంజినీర్లు కలిసి ఓ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ రూపొందించగా దానికి ఫైనల్ అప్రూవల్స్‌, స్పెసిఫికేషన్స్ వెరిఫికేషన్, టెస్టింగ్‌కు మూడేళ్ల సమయం పట్టింది.

‘ఆటమ్ 1.0 (ATUM 1.0)’ పేరుతో రూపొందించిన ఈ బైక్ బరువు 35 కిలోలు. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. బైక్‌కు 48 వోల్టుల విద్యుత్ అవసరమని, 250 వాట్ల లిథియమ్ బ్యాటరీని బ్యాకప్‌తో ఒకసారి చార్జ్ చేస్తే వంద కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చని సంస్థ వెల్లడించింది. స్టైలిష్‌లుక్‌తో ఉండే ఈ ‘ఆటమ్ 1.0’ ధర రూ.50 వేలని చెప్పారు. కస్టమర్లు తమ Atumobile’s పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ బైక్‌ను బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మరి ఇలాంటి బైక్‌ను తయారు చేసిన వంశీని పలువురు అభినందిస్తున్నారు.

స్మార్ట్రాన్ ఇండియా నుండి సరికొత్త ఈ-బైక్.. త్వరలోనే మార్కెట్‌లోకి ‘టీబైక్ వన్ ప్రొ’..

సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా?… అయితే మీకు కావాల్సిన బైక్‏ను నచ్చిన ధరలో ‏తీసుకోండి ఇలా..