ఓటు ఎలా వేయాలో తెలియజేసిన గూగుల్‌..

| Edited By:

Apr 23, 2019 | 1:36 PM

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలు ఇవాళ కొనసాగుతున్నాయి. మూడో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా గూగుల్‌ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. ఈ డూడుల్‌లో వేలికి సిరా చుక్క ఉన్నట్టు చూపిస్తున్న గూగుల్‌ దేశ ప్రజలకు ఓటేయాలని అప్పీల్‌ చేసింది. ఈ డూడుల్‌పై క్లిక్‌ చేయగానే ఓటు ఎలా వేయాలనే అంశాలతో పాటు ఇతర అంశాలను […]

ఓటు ఎలా వేయాలో తెలియజేసిన గూగుల్‌..
Follow us on

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలు ఇవాళ కొనసాగుతున్నాయి. మూడో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా గూగుల్‌ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. ఈ డూడుల్‌లో వేలికి సిరా చుక్క ఉన్నట్టు చూపిస్తున్న గూగుల్‌ దేశ ప్రజలకు ఓటేయాలని అప్పీల్‌ చేసింది. ఈ డూడుల్‌పై క్లిక్‌ చేయగానే ఓటు ఎలా వేయాలనే అంశాలతో పాటు ఇతర అంశాలను సవివరంగా పొందుపరిచింది గూగుల్‌.